
భారతదేశంలో అతిపెద్ద టెక్ కంపెనీ టీసీఎస్. ఇందులో జాబ్ కొడితే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ పాసైనంత సంతోషపడేవాళ్లు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఒక ప్రభుత్వ ఉద్యోగం దక్కింత ఫీలయ్యేవాళ్లు. కానీ కార్పొరేట్ కంపెనీలు తమకు అక్కర్లేదు అనుకుంటే క్షణాల్లో ఉద్యోగులను పీకేస్తాయి నిర్థాక్షణ్యంగా వ్యవహరిస్తాయని టీసీఎస్ ఇటీవలి ధోరణి చెబుతోంది. కంపెనీలో లేఆఫ్స్ ప్రక్రియ ఎలా జరుగుతుందో బయటకొచ్చిన మాజీ ఉద్యోగులు చెప్పేవి వింటుంటే హెచ్ఆర్ విభాగం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందనేది తెలుస్తోంది.
కంపెనీ తన అధికారిక లెక్కల ప్రకారం లేఆఫ్స్ కింద కేవలం 12వేల మందిని మాత్రమే తొలగించినట్లు చెబుతున్నప్పటికీ లోపల ఉద్యోగులు మాత్రం ఈ సంఖ్య 80వేల వరకు ఉండొచ్చని అంటున్నారు. ఒక వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో టీసీఎస్ కంపెనీలో మిత్రుడు 15 ఏళ్లుగా పిచేశాడని లేఆఫ్స్ సమయంలో అతడిని రిజైన్ చేయమన్నారని అతను చెప్పిన విషయం ప్రకారం కంపెనీ మెుత్తంలో 80వేల మందిని ఇళ్లకు పంపించారని పోస్ట్ పెట్టాడు సోహన్ సర్కార్. కొంత మందికి కంపెనీ సివరెన్స్ ఇస్తుండగా మరికొందరిని అర్థాంతరంగా ఇళ్లకు పంపుతోందని వెల్లడించాడు.
I’ve heard similar story from a friend whose wife works at TCS. Not sure about the 80k number but he said people are being let go without severance packages
— Jashan (@Jashan_lfc) September 28, 2025
ఈ పోస్టుపై చాలా మంది స్పందిస్తూ తమ అనుభవాలను టీసీఎస్ లేఆఫ్స్ గురించి పంచుకున్నారు. మరొకరు 80వేల మందిని తొలగించారో లేదో తెలియదని కనీసం 40వేల నుంచి 50వేల మందిని ఖచ్చితంగా లేఆఫ్ చేసి ఉండొచ్చని కామెంట్ చేశారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ ని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని కంపెనీ ఫోర్స్ చేసినట్లు చెప్పిన వ్యక్తి ప్రతి వారం కంపెనీకి వస్తున్న ఫ్లూయిడిటీ లిస్ట్ లో పేర్లున్న వ్యక్తులను టీసీఎస్ లేఆఫ్ చేస్తున్నట్లు తేలింది.
గడచిన కొన్నేళ్లుగా ఏఐ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో చాలా టెక్ కంపెనీలు మధ్యస్థాయి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. యాక్సెంచర్ కూడా 11వేల ఉద్యోగులను తగ్గించిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఏఐ కంపెనీల వ్యవస్థాపకులు మాత్రం కొత్త జాబ్స్ వస్తాయి.. ఏఐతో ఆపర్చునిటీస్ పెరుగుతాయి అంటు కల్లబొల్లి మాటలతో టెక్కీలను మభ్యపెడుతున్నారు. రానున్న కాలంలో అధిక స్కిల్ సెట్ ఉన్న విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు దొరికే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెుత్తానికి టీసీఎస్ మాత్రం తాము కేవలం 2 శాతం అంటే 12వేల ఉద్యోగులను తగ్గించామని చెబుతోంది. కానీ పరిశ్రమ వ్యాప్తంగా టీసీఎస్ లేఆఫ్స్ టెన్షన్ వాతావరణాన్ని, ఆందోళనలను పెంచేస్తోందని ఉద్యోగులు అంటున్నారు. ఎప్పుడు సడెన్ గా పిలిచి రిజైన్ చేయమంటారో తెలియకు కొన్ని వారాలుగా బిక్కుబిక్కుమంటూ ఆఫీసులకు వెలుతున్నారు. ఏ నిమిషం జాబ్ పోతుందో తెలియటం లేదని వాపోతున్నారు. అయితే కొన్ని వారాలుగా కంపెనీ భారీ సంఖ్యలోనే ఉద్యోగులను ఇళ్లకు పంపించేస్తోందని ప్రస్తుతం టీసీఎస్ లో పనిచేస్తున్న టెక్కీలు అంటున్నారు.