Ish Sodhi: జాతీయ గీతం పాడుతున్నప్పుడు గుక్కపట్టి ఏడ్చిన ఇష్‌ సోధీ.. ఎందుకో తెలుసా..?

Ish Sodhi: జాతీయ గీతం పాడుతున్నప్పుడు గుక్కపట్టి ఏడ్చిన ఇష్‌ సోధీ.. ఎందుకో తెలుసా..?

Ish Sodhi: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో భారత్–న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధీ జాతీయ గీతం పాడుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి లోనైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత మూలాలు కలిగిన ఇష్ సోధీ పంజాబ్‌లోని లుధియానాలో జన్మించాడు. చిన్న వయసులోనే కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తరువాత క్రికెట్‌లో అద్భుతమైన ప్రతిభ చూపుతూ కివీస్ జట్టులో చోటు సంపాదించాడు.

అయితే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలు వినిపిస్తున్న సమయంలో సోధీ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. న్యూజిలాండ్ జాతీయ గీతాన్ని ఆలపిస్తూ అతడు భావోద్వేగంతో కనిపించాడు. తనను ఆశ్రయించిన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గర్వం, ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపించాయి. ఈ క్షణం అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేసింది. ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లు దూకుడుగా ఆడుతూ 20 ఓవర్లలో 255 పరుగులు సాధించి న్యూజిలాండ్ ముందుకు భారీ లక్ష్యాన్ని పెట్టారు. ఈ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు కూడా నమోదైంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్‌లో టాప్–3 బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం ఇదే మొదటిసారి.

లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ పీకల్లోతూ కష్టాల్లో పడింది.  కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ ఒక్కడే పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు ఫిన్ అలెన్ (9), రచిన్ రవీంద్ర (1), గ్లెన్ ఫిలిప్స్ (5), మార్క్ చాప్మన్ (3) దారుణంగా విఫలం కాగా.. సీఫెర్ట్ ఒక్కడే 26 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సులతో 52 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ మిచెల్ శాట్నర్ (12), డారెల్ మిచెల్ (15) ఆచి తూచి బ్యాటింగ్ చేస్తున్నారు.