త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా హెబ్బా పటేల్ హీరోయిన్‌గా శ్రీనివాస్ మన్నె రూపొందించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 12న రిలీజ్. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ ‘గతంలో జెనీలియా లీడ్ రోల్‌లో ‘కథ’ అనే సినిమా తీశా. కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోయినా ప్రశంసలు వచ్చాయి. వ్యక్తిగత కారణాలతో డైరెక్షన్‌కు గ్యాప్ వచ్చింది.
నిర్మాత దామోదర్ ప్రసాద్ గారితో ఉన్న అనుబంధం దృష్ట్యా, ఆయన సపోర్ట్‌తో ఈ సినిమా చేశా. ఆత్మలు, మూఢ నమ్మకాలపై ఇందులో చర్చించాం. ఆత్మలను రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్లకు అది నమ్మకం. మనకు జరగలేదు కాబట్టి మూఢ నమ్మకం. ఆత్మ అనేది లేకపోతే ఆ పదమే పుట్టదు కదా, మంచి చెడు ఉన్నట్లే అది కూడా ఉంటుంది. సినిమాలో షాకింగ్ ఎలిమెంట్స్ చూసి ప్రతి ఒక్కరూ కచ్చితంగా భయపడతారు.
హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమా చూడకూడదు. సెన్సారు వాళ్లు చూసి సినిమా చాలా భయపెట్టేలా ఉంది. కానీ గుడ్ కంటెంట్ అన్నారు. మా కంటెంట్‌తోపాటు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే విధానం విజయంపై నమ్మకం ఏర్పడింది’ అని చెప్పారు.
