ముంబైని గెలిపించిన ఇషాన్‌‌ కిషన్‌‌, సూర్య కుమార్​

ముంబైని గెలిపించిన ఇషాన్‌‌ కిషన్‌‌, సూర్య కుమార్​

 

  •     ముంబైని గెలిపించిన ఇషాన్‌‌ కిషన్‌‌, సూర్య కుమార్​
  •     6 వికెట్ల తేడాతో పంజాబ్‌‌ కింగ్స్​ ఓటమి
  •     లివింగ్‌‌స్టోన్‌‌, జితేష్‌‌ శ్రమ వృథా

మొహాలీ: ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్‌‌ మరోసారి బ్యాటింగ్‌‌లో అదరగొట్టింది. భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇషాన్‌‌ కిషన్‌‌ (41 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 75), సూర్య కుమార్‌‌ (31 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 66) దంచికొట్టడంతో.. బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్‌‌ కింగ్స్‌‌పై నెగ్గింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌ 20 ఓవర్లలో 214/3 స్కోరు చేసింది. లివింగ్‌‌స్టోన్‌‌ (42 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 82 నాటౌట్‌‌), జితేష్‌‌ శర్మ (27 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 49 నాటౌట్‌‌) చెలరేగారు. తర్వాత ముంబై 18.5 ఓవర్లలోనే 216/4 స్కోరు చేసి గెలిచింది. చివర్లో తిలక్‌‌ వర్మ (10 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్స్‌‌లతో 26 నాటౌట్‌‌) మెరుపులు మెరిపించాడు. ఇషాన్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

ఆఖర్లో అదుర్స్‌‌..

ఆరంభంలో ఇబ్బందిపడ్డ పంజాబ్‌‌కు ఆఖర్లో లివింగ్‌‌స్టోన్‌‌, జితేష్‌‌ భారీ స్కోరు అందించారు. సెకండ్‌‌ ఓవర్‌‌లోనే ప్రభుసిమ్రన్‌‌ (9) ఔటైనా, ధవన్‌‌ (30), మాథ్యూ షార్ట్‌‌ (27) ఉన్నంతసేపు వేగంగా ఆడి రన్‌‌రేట్‌‌ను కాపాడారు. దీంతో 13/1తో కష్టాల్లో పడిన కింగ్స్‌‌ పవర్‌‌ప్లేలో 50/1కి చేరింది. అయితే ఫీల్డింగ్‌‌ పెరగడంతో బౌలింగ్‌‌కు దిగిన పీయూష్‌‌ చావ్లా (2/29) వరుస విరామాల్లో పంజాబ్‌‌ను దెబ్బకొట్టాడు. 8వ ఓవర్‌‌లో ధవన్‌‌ను ఔట్‌‌ చేసి రెండో వికెట్‌‌కు 49 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ను బ్రేక్‌‌ చేశాడు. ఈ దశలో ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చిన  లివింగ్‌‌స్టోన్‌‌ ముంబై బౌలర్లందర్ని చితక్కొట్టాడు. దీంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో పంజాబ్‌‌ 78/2తో నిలిచింది. 11వ ఓవర్‌‌లో లివింగ్‌‌స్టోన్‌‌ 4, 6 బాదితే, తర్వాతి ఓవర్‌‌లో షార్ట్‌‌ వెనుదిరిగాడు. థర్డ్‌‌ వికెట్‌‌కు 33 రన్స్‌‌ భాగస్వామ్యానికి బ్రేక్‌‌ పడింది. లివింగ్‌‌స్టోన్‌‌తో జతకలిసిన జితేష్‌‌ కూడా ఫర్వాలేదనిపించాడు. 13వ ఓవర్‌‌లో హ్యాట్రిక్‌‌ ఫోర్స్‌‌తో కుదురుకున్నాడు. ఆ వెంటనే భారీ సిక్స్‌‌ సంధించాడు. 15వ ఓవర్‌‌లో లివింగ్‌‌స్టోన్‌‌ మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. 17వ ఓవర్‌‌లో జితేష్‌‌ 6, 4తో 14 రన్స్‌‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌‌లో ఫోర్‌‌తో లివింగ్‌‌స్టోన్‌‌ 32 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ ఫినిష్‌‌ చేశాడు. అదే దూకుడుతో ఆర్చర్‌‌ వేసిన 19వ ఓవర్‌‌లో హ్యాట్రిక్‌‌ ఫోర్స్‌‌తో చెలరేగాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో 9 రన్సే వచ్చినా నాలుగో వికెట్‌‌కు 53 బాల్స్‌‌లోనే 119 రన్స్‌‌ జతయ్యాయి.  

ఇషాన్‌‌, సూర్య మెరుపులు

ఛేజింగ్‌‌లో మూడో బాల్‌‌కే రోహిత్‌‌ (0) డకౌటయ్యాడు. ఇషాన్‌‌ కిషన్‌‌ నిలబడ్డా.. ఆరో ఓవర్‌‌లో కామెరూన్‌‌ గ్రీన్‌‌ (23) వెనుదిరిగాడు. అప్పటికి ముంబై స్కోరు 54/2. ఇక ఇక్కడి నుంచి ఇషాన్‌‌తో జతకలిసిన సూర్య.. పంజాబ్‌‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. దీంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో ముంబై  91/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. 11వ ఓవర్‌‌లో మూడు ఫోర్లు కొట్టిన సూర్య 13వ ఓవర్‌‌లో 6, 6, 4, 4తో 23 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ అందుకున్నాడు. మధ్యలో ఇషాన్‌‌ కూడా ఫోర్లతో మోత మోగిస్తూ 29 బాల్స్‌‌లో ఫిఫ్టీ ఫినిష్‌‌ చేశాడు. 15వ ఓవర్‌‌లో సూర్య ఫోర్‌‌ బాదితే, ఇషాన్‌‌ 6, 4, 4తో 21 రన్స్‌‌ దంచాడు. దీంతో 15 ఓవర్లలో ముంబై స్కోరు 170/2కి పెరిగింది. ముంబై గెలుపు ఈజీ అనుకుంటున్న టైమ్‌‌లో 16వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కు సూర్యను ఔట్‌‌ చేసి ఎల్లిస్‌‌ (2/34) భారీ షాక్‌‌ ఇచ్చాడు. మూడో వికెట్‌‌కు 116 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌ తొలి బాల్‌‌కే ఇషాన్‌‌ కూడా పెవిలియన్‌‌ బాట పట్టాడు. ఈ ఓవర్‌‌లో తిలక్‌‌ వర్మ లాస్ట్‌‌ మూడు బాల్స్‌‌ను 6, 4, 6గా మలిచాడు. ఫోర్‌‌తో ఖాతా తెరిచిన టిమ్‌‌ డేవిడ్‌‌ (19 నాటౌట్‌‌) కూడా వేగంగా ఆడటంతో టార్గెట్‌‌ 12 బాల్స్‌‌లో 12గా మారింది. దీన్ని తిలక్‌‌, డేవిడ్‌‌ ఈజీగా ఛేదించి ముంబైకి సూపర్‌‌ విక్టరీని అందించారు.