
దోహా: ఖతార్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. మంగళవారం దోహాలోని పలు ప్రాంతాలపై బాంబులు జారవిడిచినట్లు పేర్కొంది. హమాస్ సీనియర్ లీడర్లను తుదముట్టించడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ సమ్మిట్ ఆఫ్ ఫైర్’ పేరుతో ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
ఈ భూమ్మీద హమాస్ ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశమేదీ లేదని, హమాస్ ను పూర్తిగా తుడిచిపెట్టే వరకూ విశ్రమించబోమని మరోమారు ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ దాడులను ఖతార్ ఖండించింది. పిరికిపంద చర్య అని, అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ అతిక్రమించిందని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మండిపడ్డారు.