ఏప్రిల్ 3న భారత్ కు ఇజ్రాయెల్ ప్రధాని

ఏప్రిల్ 3న భారత్ కు ఇజ్రాయెల్ ప్రధాని

న్యూఢిల్లీ: వచ్చే నెల మూడో తారీఖున ఇజ్రాయెల్  ప్రధాన మంత్రి భారత్ కు రానున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మొదటిసారి భారత్ లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్, భారత్ ల మైత్రి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానిని మోడీ భారత్ కు ఆహ్వానించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యవసాయం, ఇరిగేషన్, వాణిజ్యం, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి తదితర రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

ఎంపీ పదవికి అఖిలేశ్ యాదవ్ రాజీనామా

రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలన నడుస్తోంది