
ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరామం లేకుండా దాడులు చేస్తున్నాయి. అయితే ఆ దేశం ప్రయోగించిన ఓ రాకెట్ లాంఛర్ దారితప్పి ఈజిప్ట్ మిలిటరీ పోస్ట్ పై పడింది. ఈప్రమాదంలో మిలిటరీ పోస్ట్ ధ్వంసం అయ్యింది. ఇజ్రాయెల్ ,గాజా,ఈజిప్ట్ మూడు దేశాల బోర్డర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో తమవైపు కొంత మందికి స్వల్ప గాయాలైనట్లు ఈజిప్టు సైన్యం వెల్లడించింది. . దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పందించింది. జరిగిన తప్పిదంపై చింతిస్తున్నామని..ఘటనపై దర్యాప్తు చేపట్టామని తెలిపింది.
ఇజ్రాయెల్ దిగ్బంధం, బాంబుదాడులతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన పాలస్తీనియన్లకు మానవతా సాయంగా మన దేశం నుంచి మందులు, ఇతర అత్యవసర వస్తువులను కేంద్ర ప్రభుత్వం పంపింది. వాయుసేన కార్గో విమానం ‘ఐఏఎఫ్ సీ17’లో 6.5 టన్నుల మందులు, 32 టన్నుల డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ ను పాలస్తీనాకు పంపినట్లు ఆదివారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ లో వెల్లడించారు
20 ట్రక్కులు దాటంగనే బార్డర్ క్లోజ్
ఈజిప్టు నుంచి రఫా బార్డర్ క్రాసింగ్ ద్వారా గాజాలోకి 20 ట్రక్కులు మాత్రమే ప్రవేశించాయి. పాలస్తీనియన్లకు మందులు, ఫుడ్, ఇతర అత్యవసర వస్తువులతో దాదాపు 200 ట్రక్కులు ఈజిప్ట్, గాజా బార్డర్ (రఫా క్రాసింగ్) వద్ద కొన్ని రోజులుగా ఆగిపోయాయి. అమెరికా ఒత్తిడితో బార్డర్ ఓపెన్ చేసిన ఇజ్రాయెల్.. శనివారం 20 ట్రక్కులనే గాజాలోకి అనుమతించింది. ఆ తర్వాత క్రాసింగ్‌ను మళ్లీ క్లోజ్ చేసింది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాలస్తీనియన్లకు ఈ 20 ట్రక్కుల సరుకులు ఏమూలకూ సరిపోవని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఓచా’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది