ఇండియా పరువు తీశారు.. కర్ణాటకలో ఇజ్రాయెల్ టూరిస్ట్పై గ్యాంగ్ రేప్

ఇండియా పరువు తీశారు.. కర్ణాటకలో ఇజ్రాయెల్ టూరిస్ట్పై గ్యాంగ్ రేప్

ఇండియాలోని అందమైన ప్రదేశాలు, కల్చర్ చూసేందుకు వచ్చే టూరిస్ట్ లపై దాడులు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. టూరిస్ట్ లు మన అతిథులు.. వారిని గౌరవించాలనే విచక్షణ మరిచి దాడులకు దిగుతున్నారు కొందరు దుండగులు. దబ్బులు వసూలు చేయడం, గొడవలు పెట్టుకోవడంమే కాకుండా చివరికి అత్యాచారం చేసేవరకు తెగించారు. తాజాగా కర్ణాటకలో జరిగిన గ్యాంగ్ రేప్ సంచలనం సృష్టించింది. 

కర్ణాటకలో ఇజ్రాయెల్ టూరిస్ట్ (27) తో పాటు ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ (29) ను గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు. గురువారం (మార్చి 6) రాత్రి కర్ణాటకలోని హంపీలో జరిగింది ఈ దారుణ ఘటన. వీళ్లతో పాటు వచ్చిన ముగ్గురు పురుషులపై కూడా దాడులు చేసి పక్కనే ఉన్న కాలువలో పడేశారు. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది ఈ ఘటన. హంపీకి 4 కిలోమీటర్ల దూరంలో పర్యాటకులు ఎక్కువగా వస్తుండే సనాపూర్ చెరువు దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇజ్రాయెల్ మహిళా టూరిస్ట్ తో పాటు ఒడిషా, మహారాష్ట్ర, అమెరికాకు చెందిన ముగ్గురు పురుష పర్యాటకులపై దాడులు చేశారు దుండగులు.

‘‘ బైక్ పై వచ్చిన  ముగ్గురు దుండగులు పెట్రోల్ బంక్ కు ఎటు వెళ్లాలని టూరిస్టులను అడిగారు. ఈ దగ్గరల్లో బంక్ లేదని చెప్పడంతో.. పెట్రోల్ కు డబ్బులు ఇవ్వాలని అడిగారు. 20 రూపాయలు ఇవ్వడంతో ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడ్డొచ్చిన పురుష టూరిస్ట్ లను కొట్టి కాలువలో పడేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ టూరిస్ట్ తో పాటు ఇంటి ఓనర్ ను గ్యాంగ్ రేప్ చేశారు. శుక్రవారం కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.  టూరిస్టులు చెప్పిన వివరాల ప్రకారం దుండగులు స్థానికులు. కన్నడం, తెలుగు మాట్లాడుతున్నారు..’’ అని సీనియర్ పోలీసు అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. 

కాలువలో పడిన టూరిస్టులలో ఇద్దరు కాసేపటికి బయటికి రాగలిగారు. కానీ అందులో ఒకరు మాత్రం రాలేకపోయాడు. శుక్రవారం ఉదయం పోలీసులు కాలువలోనే ఉండిపోయిన టూరిస్ట్ బాడీని వెలికి తీశారు. టూరిస్టులందరికీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

పర్యటన కోసం వచ్చిన అతిథులపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన దుండగుల కోసం వెదుకుతున్నారు పోలీసులు. స్పెషల్ డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దించారు. మరో టీం అనుమానితులను విచారించే పనిలో ఉంది. ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర, దేశ పరువు తీసేలా వ్యవహరించిన దుండగులను కఠినంగా శిక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.