రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇస్రో సైంటిస్టుల సంబరాలు

రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇస్రో సైంటిస్టుల సంబరాలు

శ్రీహరి కోట నుంచి PSLV  C-55 రాకెట్ ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు ఇస్రో సైంటిస్టులు. శనివారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 2:19 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం జరిగిన 20 నిమిషాల తర్వాత కక్ష్యలోకి శాటిలైట్స్ ప్రవేశించాయి. ఇస్రో.. నాలుగు దశల్లో శాటిలైట్స్ ను నింగిలోకి ప్రవేశపెట్టారు.

పీఎస్ఎల్వీ సీ-55 రాకెట్ ద్వారా రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు ఇస్రో సైంటిస్టులు. ఈ రాకెట్ లో సింగపూర్ కు చెందిన 741 కిలోల EOS 2 శాటిలైట్, 16 కిలోలున్న లూమిటైట్ శాటిలైట్స్ ను మోసుకెళ్లింది.

వాటితో పాటు భారత్ కు చెందిన రెండు ఉపగ్రాహలను నింగిలోకి పంపించింది. ఈ ఉపగ్రహాలు భూమికి 586 కిలోమీటర్ల ఎత్తులో.. భూమి చుట్టూ తిరగనున్నాయి. ఈ ప్రయోగం విజయ వంతం అయినందున.. త్వరలో చంద్రయాన్ -2, ఆదిత్య రాకెట్ ప్రయోగాలు చేయాలని ఇస్రో భావిస్తోంది.

ఈ ఉపగ్రహంలో సింథటిక్‌  ఎపర్చరు రాడార్‌ పేలోడ్‌ను ఉంచారు. దాంతో అన్ని వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజీ అందించడానికి సాయపడుతుంది. లూమాలైట్‌-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం ఈ సాటిలైట్ లక్ష్యం.