ఇస్రో మహిళా శాస్త్రవేత్త గుండెపోటుతో మృతి.. కౌంట్ డౌన్ చెప్పేది ఈమే

ఇస్రో మహిళా శాస్త్రవేత్త గుండెపోటుతో మృతి.. కౌంట్ డౌన్ చెప్పేది ఈమే

ఇస్రో.. రాకెట్ ప్రయోగాలు అందరూ చూస్తూ ఉంటారు.. రాకెట్ ప్రయోగ సమయంలో లాంఛింగ్ కోసం కౌంట్ డౌన్ అలర్ట్ వస్తుంది.. మైనస్ వన్ మినిట్.. మైనస్ ఫిఫ్టీ సెకన్స్.. మైనస్ 40 సెకన్స్ అంటూ 10, 9, 8, 7 అంటూ చదవుతూ.. జీరో దగ్గర రాగానే రాకెట్ గాల్లోకి ఎగురుతుంది. ఆ తర్వాత ప్లస్ ఫైవ్ సెకన్స్ అంటూ ఓ మహిళా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. 

ఈ వాయిస్ మనకే కాదు.. ఇస్రోలోని అన్ని డిపార్టుమెంట్లకు అలర్ట్ చేస్తూ.. కౌంట్ డౌన్ ద్వారా అలర్ట్ చేస్తుంటారు. ఈ ఎవరో కాదు.. ఇస్రోలోని సీనియర్ మహిళా శాస్త్రవేత్త. ఆమె పేరు వలర్మతి ఇస్రోలో జాయిన్ అయినప్పటి నుంచి ఈమే కౌంట్ డౌన్ అలర్ట్ ఇస్తూ ఉంటారు.. లైవ్ టెలికాస్టు వచ్చిన తర్వాత ఈ వాయిస్ అందరికీ సుపరిచితం.. ఇప్పుడు ఈమె చనిపోయారు. ఇస్రో వాయిస్ ఇచ్చే శాస్త్రవేత్తగా అందరికీ సుపరిచితురాలు అయిన వలర్మతి తీవ్ర గుండెపోటుతో మరణించారు. కార్డియాక్ అరెస్ట్ అని వెల్లడించారు డాక్టర్లు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

చాలా కాలంగా ఇస్రో ప్రయోగించే రాకెట్ ప్రయోగాలన్నింటికి వాయిస్ ఓవర్ ఇచ్చే వలర్మతి గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించారు. జులై 14న ప్రయోగించిన అత్యంత విజయవంతమైన చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్‌గా మారింది. 1959లో తమిళనాడులోని అరియలూర్‌లో జన్మించిన వలర్మతి 1984లో ఇస్రోలో చేరారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని వలర్మతి మొదటిసారిగా 2015లో అందుకున్నారు.  

ఇస్రో మాజీ డైరెక్టర్ డా. పివి వెంకటకృష్ణన్ ఆమె మృతికి సంతాపం తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు, శ్రీహరికోట నుండి ఇస్రో భవిష్యత్తు మిషన్‌ల కౌంట్‌డౌన్‌లకు వలర్మతి మేడమ్ వాయిస్ ఉండదు. చంద్రయాన్ 3 ఆమె చివరి కౌంట్‌డౌన్ ప్రకటన. ఊహించని మరణం అంటూ ఆయన ట్వీట్ చేశారు.