చంద్రయాన్ 3 దిగిన ప్రదేశంలో మట్టి, దుమ్ము.. రోవర్ నీడ, అద్దులు..

చంద్రయాన్ 3 దిగిన ప్రదేశంలో మట్టి, దుమ్ము.. రోవర్ నీడ, అద్దులు..

చంద్రయాన్ 3 దిగిన ప్రదేశం ఎలా ఉంది అనేది ఇప్పుడు తేలిపోయింది. ఇస్రో రిలీజ్ చేసిన వీడియో ద్వారా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ కిందకు దిగే సమయంలో.. చంద్రుడిపై ఎండ ఉంది. రోవర్, ల్యాండర్ నీడ స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. అంతే కాకుండా.. రోవర్ చంద్రుడిపై బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలో.. రోవర్ చక్రాల అద్దులు స్పష్టంగా చంద్రుడిపై పడ్డాయి. అంటే ల్యాండర్ దిగిన ప్రదేశంలో మట్టి, దుమ్ము ఉన్నట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది. 

చంద్రుడిపై ఎంత టెంపరేచర్ ఉంది అనేది తెలియకపోయినా.. ఎండ బాగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. ల్యాండర్, రోవర్ నీడలు చంద్రుడిపై కనిపిస్తున్నాయి. అంటే చంద్రుడి ఉపరితలం మట్టి, దుమ్ముతో నిండి ఉంది. రోవర్ ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా.. చదరంగా తిరగటం చూస్తుంటే.. పెద్దగా గోతులు, గుంతలు ఉన్నట్లు అనిపించటం లేదు. రోవర్ జర్నీ సాగే కొద్దీ.. మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.
చంద్రయాన్3 రోవర్ ల్యాండర్ నుంచి చంద్రుని ఉపరితలంపై దూసుకుపోతున్న వీడియాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. రోవర్ కదలికలను విక్రమ్ ల్యాండర్ కెమెరా ఇస్రోకు పంపించింది. ఈ వీడియోలో చంద్రుడిపై ప్రగ్యాన్ రోవర్ తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.