తిప్పరా మీసం : ఆదిత్య L1 ప్రయోగం విజయవంతం

తిప్పరా మీసం : ఆదిత్య L1 ప్రయోగం విజయవంతం

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూర్యుడిపై ప్రయోగానికి అంతరిక్షంలోకి పంపిన ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ విజయవంతం అయ్యింది. అంతరిక్షంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. మొత్తం 14 నిమిషాల పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం ద్వారా.. నిర్దేశిత కక్ష్యలోకి దూసుకెళ్లింది. 

మొన్నటికి మొన్న చంద్రయాన్ విజయవంతంతో ఊపు మీదున్న ఇస్త్రో శాస్త్రవేత్తలు.. ఇప్పుడు సూర్యుడు అంతు చూడ్డానికి ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ ప్రయోగించారు. నాలుగు నెలల సమయం.. 15 లక్షల కిలోమీటర్ల జర్నీతో మొదలైన ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం అయ్యింది. భూ కక్ష్యపైన.. సూర్యుడి వైపు జర్నీ చేసే ప్రదేశంలో.. ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ ను విజయవంతంగా ప్రవేశపెట్టారు. నాలుగు దశల్లో ప్రయాణించిన పీఎస్ఎల్వీ 57 రాకెట్.. చివరి దశను సైతం విజయవంతం చేసి.. ఆదిత్య ఎల్1 ను నిర్ధేశిత కక్ష్యలోకి చేర్చింది. మిషన్ సన్ విజయవంతం అయినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథన్ ప్రకటించారు. 

 

ఆదిత్య-L1 మిషన్ లక్ష్యాలు

  • సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై ఆదిత్య ఎల్ 1 మిషన్ అధ్యయనం చేయనుంది. 
  • ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని భూమి నుంచి సూర్యుడి దిశలో లాగ్రేంజ్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది. 
  • ఎల్ 1 పాయింట్ వరకు  చేరేందుకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహానికి దాదాపు 125 రోజుల సమయం పడుతుంది. 
  • లాగ్రేంజ్‌ పాయింట్‌-1  ప్రదేశం నుంచి  ఆదిత్య ఎల్ 1 మిషన్ సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేస్తుంది
  • ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం సౌర వ్యవస్థపై పరిశోధనలు జరపనుంది.  సౌర తుఫానులు, సూర్యుడిపై  పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 
  • ఆదిత్య ఎల్ 1 ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తోంది.  ఇవి సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సూర్యుడి బయటి పొర (కరోనా), సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయనున్నాయి. తద్వారా సౌర తుఫానులు, అక్కడి వాతావరణం, పరిస్థితులను తెలుసుకోవచ్చు.