PSLV-XL రాకెట్‌కు చెందిన బూస్ట‌ర్ మోటార్‌ను ప‌రీక్షించిన ఇస్రో

PSLV-XL రాకెట్‌కు చెందిన బూస్ట‌ర్ మోటార్‌ను ప‌రీక్షించిన ఇస్రో

PSLV-XL రాకెట్‌కు చెందిన బూస్ట‌ర్ మోటార్‌ను  శ్రీహ‌రికోట‌లో  ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) విజయవంతంగా ప‌రీక్షించింది. ఈ ప‌రీక్షలో బూస్ట‌ర్ మోటార్ ప‌నితీరును పరీక్షించారు. ఈ బూస్ట‌ర్‌ను  ఎక‌నామిక్స్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్  రూపొందించగా...PSOM-XL గా నామకరణం చేశారు.  PSLV రాకెట్ల కోసం ప్రైవేటు కంపెనీలు బూస్ట‌ర్లను అభివృద్ధి చేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. 

పిఎస్‌ఎల్‌విని ఎండ్-టు-ఎండ్ ఉత్పత్తిలో ఇది మొదటి అడుగు. మరోవైపు  ఎక‌నామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ సంస్థ నాగ‌పూర్‌లో ఉంది. బూస్ట‌ర్ టెక్నాల‌జీని ఆ కంపెనీకి 2019లో ఇస్రో బ‌దిలీ చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్  యొక్క వాణిజ్య విభాగం ఐదు PSLV-XL రాకెట్‌లను తయారు చేసేందుకు HAL-L&T నేతృత్వంలోని కన్సార్టియంను ఎంపిక చేసింది.