PSLV-C62 ప్రయోగం.. కౌంట్ డౌన్ కు సిద్దమైన ISRO.. 

PSLV-C62 ప్రయోగం.. కౌంట్ డౌన్ కు సిద్దమైన ISRO.. 

PSLV-C62 ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. జనవరి 12న జరగనున్న ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది ఇస్రో. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది ఈ రాకెట్. జనవరి 12 ఉదయం 10:17 గంటలకు జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు ఇస్రో అధికారిక వెబ్ సైట్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లాంచ్ గ్యాలరీ టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది ఇస్రో. ఈ ప్రయోగం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) యొక్క 64వ ప్రయోగం.

ఈ మిషన్ యొక్క ప్రాథమిక పేలోడ్ EOS-N1 (అన్వేష), వ్యవసాయం, అర్బన్ మ్యాపింగ్, పర్యావరణ పర్యవేక్షణలో ఇండియా రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలను పెంపొందించడానికి రూపొందించబడింది ఈ శాటిలైట్. దీంతో పాటు ఇండియా, ఇతర దేశాల నుంచి 18 కో ప్యాసెంజర్స్ పే లోడ్ లు ఈ జర్నీలో భాగం కానున్నాయి. ఈ ప్రయోగం కీలక మల్టీ శాటిలైట్ డెప్లాయిమెంట్ గా నిలవనుంది.

బెంగళూరుకు చెందిన ఆర్బిట్‌ఎఐడి ఏరోస్పేస్ డెవలప్ చేసిన ఆయుల్‌సాట్ ఈ ప్రయోగంలో కీలకం కానుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆన్-ఆర్బిట్ రీఫ్యూయలింగ్ మిషన్‌ అని సమాచారం. ఇది రీయూజబుల్, సస్టైనబుల్ శాటిలైట్ ఆపరేషన్స్ లో కీలక అడుగు అని చెప్పచ్చు.