ఇవాళ నింగిలోకి PSLV C-53

ఇవాళ నింగిలోకి PSLV C-53

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మరో రాకెట్ ప్రయోగానికి అంతా రెడీ అయ్యింది. PSLV C-53 రాకెట్ ను సాయంత్రం 6 గంటల రెండు నిమిషాలకు నింగిలోకి పంపనుంది ఇస్రో. అయితే ముందుగా నిర్ణయించిన టైం కంటే రెండు నిమిషాలు ఆలస్యంగా రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ తో సింగపూర్ కు చెందిన DSEO 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్-1 ఉపగ్రహాలను పంపించనున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఇస్రో ఇప్పటి వరకు వాణిజ్య పరంగా PSLV రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.