మిషన్ ​గగన్​యాన్లో 21న కీలక పరీక్ష

మిషన్ ​గగన్​యాన్లో 21న కీలక పరీక్ష
  • క్రూ మాడ్యూల్​ను నింగిలోకి పంపి పరీక్షించనున్న ఇస్రో

బెంగళూరు: అంత‌‌రిక్షంలోకి వ్యోమ‌‌గాముల్ని పంపేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక గ‌‌గ‌‌న్‌‌యాన్ మిష‌‌న్‌‌  కీలక దశకు చేరుకోనుంది. ఈనెల 21న టీవీ-డీ1 టెస్ట్ ఫ్లైట్‌‌ను నిర్వహించనున్నారు. శ్రీహ‌‌రికోట‌‌లోని షార్ లో ఆ రోజు ఉద‌‌యం 7 గంట‌‌ల నుంచి 9 గంట‌‌ల మ‌‌ధ్య ఈ టెస్ట్ చేప‌‌ట్టనున్నట్టు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దశలో షార్ కేంద్రం నుంచి మనుషులు ఎవరూ లేకుండా క్రూ మాడ్యూల్‌‌ను అంతరిక్షంలోకి పంపి.. ఆ తర్వాత సురక్షితంగా భూమికి తీసుకువచ్చేందుకు సంబంధించిన టెస్ట్ చేయనున్నారు. టీవీ-డీ1మాడ్యూల్ నిర్మాణం తుది ద‌‌శ‌‌లో ఉంద‌‌ని, ఈ మాడ్యూల్ 17 కిలోమీట‌‌ర్ల ఎత్తుకు వెళ్లిన త‌‌ర్వాత‌‌ అబార్ట్ సీక్వెన్స్‌‌లో భాగంగా మ‌‌ళ్లీ భూమి మీద‌‌కు వ‌‌స్తుంద‌‌ని ఇస్రో తెలిపింది. పారాచూట్ల సాయంతో టీవీ-డీ1 శ్రీహ‌‌రికోట నుంచి 10 కిలోమీట‌‌ర్ల దూరంలో 
బంగాళా ఖాతంలో ల్యాండ్‌‌ కానుంది.