డిసెంబర్ 7న ఫైటర్ మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్

డిసెంబర్ 7న  ఫైటర్ మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్​లో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ ‘ఫైటర్’. సిద్ధార్థ్​ ఆనంద్ దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్, మమతా ఆనంద్,  రామన్ బి, అంకు పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ టీజర్‌‌‌‌ను డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్టు ఆదివారం అనౌన్స్ చేశారు. అనిల్ కపూర్, కరణ్​ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్, శేఖర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 25న సినిమా విడుదల  కానుంది.  బ్యాంగ్ బ్యాంగ్, వార్ తర్వాత.. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.