మనసును కదిలించే జాను

మనసును కదిలించే జాను

యాంకర్ సుమ కొడుకు రోషన్  హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్‌‌గమ్’.  మానస చౌదరి హీరోయిన్‌‌. రవికాంత్ పెరేపు దర్శకత్వంలో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 29న సినిమా విడుదల  కానుంది. ఇప్పటికే వచ్చిన జిలేబి, ఇజ్జత్.. రెండు సాంగ్స్ యూత్‌‌ను ఇంప్రెస్ చేశాయి. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  

తాజాగా థర్డ్ సాంగ్‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ‘జాను’ అంటూ సాగే మూడో పాటను ఈ నెల 6న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో రోషన్, మానస జోడీ ఆకట్టుకుంటుంది. ఈ పాట మనసుని కదిలించే మెలోడీగా ఉండబోతుందని మేకర్స్ చెప్పారు.  వైవా హర్ష, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.