
ప్రముఖ వ్యాపారవేత్త, మైహోం ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఇంట్లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ నందినగర్ లోని రామేశ్వర్ రావు ఇంటితో పాటు.. హైటెక్ సిటీలోని మై హోం హబ్ లోనూ సోదాలు జరుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తం 100మందికి పైగా ఐటీ అధికారులు సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తున్నాయనే సమాచారంతో సోదాలకు దిగారు ఐటీ అధికారులు. ఇప్పటికే కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రాత్రంతా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఐటీ శాఖ కేంద్రం పరిధిలో ఉండటం… రాష్ట్ర ప్రభుత్వ అనుకూల మైహోం సంస్థలపై ఐటీ సోదాలు జరగడం సంచలనం రేపుతోంది.