ఐటీ కారిడార్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్..వ్యక్తి అరెస్ట్..31 కమర్షియల్ సిలిండర్లు సీజ్

ఐటీ కారిడార్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్..వ్యక్తి అరెస్ట్..31 కమర్షియల్ సిలిండర్లు సీజ్

మాదాపూర్, వెలుగు: కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఐటీ కారిడార్​లోని ప్రైవేట్ హాస్టళ్లకు అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. అంబర్​పేటకు చెందిన అంజిరెడ్డి మార్కెట్లో ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఏర్పడ్డ కొరతను తన ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. తన వద్ద ఉన్న సిలిండర్లను మాదాపూర్ పత్రికా నగర్​లోని ప్రైవేట్ హాస్టళ్లకు విక్రయించేందుకు బుధవారం ఆటోలో బయలుదేరారు. పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని, 31 సిలిండర్లను సీజ్ చేశారు.