40 వేల మంది ఉద్యోగాలు ఊడొచ్చు

40 వేల మంది ఉద్యోగాలు ఊడొచ్చు

న్యూఢిల్లీ: ఎకానమీ నెమ్మదించడం వల్ల మనదేశంలోని ఐటీ సేవల కంపెనీలు ఈ ఏడాది దాదాపు 40 వేల మంది మిడిల్‌‌ లెవెల్‌‌ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్‌‌ మాజీ సీఎఫ్‌‌ఓ మోహన్‌‌దాస్‌‌ పాయ్‌‌ అన్నారు. ఐదేళ్లకోసారి ఇలాంటివి జరుగుతాయని చెప్పారు.

మిడిల్‌‌లెవెల్‌‌ ఉద్యోగులు తమ జీతానికి తగినస్థాయిలో కంపెనీ ఉపయోగపడకపోవచ్చని వివరించారు. బాగా పనిచేయగలిగే వారు మాత్రమే ఉద్యోగాలను దక్కించుకోగలుగుతారని మోహన్​ దాస్​ పాయ్‌‌ స్పష్టం చేశారు.