ఫ్రెషర్స్​కి ఐటీ కంపెనీ ఆఫర్స్ .. సపోర్టివ్ టీమ్​గా..

ఫ్రెషర్స్​కి ఐటీ కంపెనీ ఆఫర్స్ .. సపోర్టివ్ టీమ్​గా..
  • సీనియర్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్, జూనియర్స్ ఆ ఫీసులకు..
  • పెండింగ్ ప్రాజెక్టుల కోసం పిలుస్తున్న కంపెనీలు
  • చిన్న సంస్థలతో పెద్దకంపెనీలు టైఅప్

హైదరాబాద్, వెలుగులాక్ డౌన్​తో సిటీలోని పలు ప్రైవేట్, సాఫ్ట్ వేర్ కంపెనీలు మూతపడగా, కొన్ని ఎంప్లాయిస్​ని తగ్గించి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాయి. కరోనా ఎఫెక్ట్, మ్యాన్ పవర్ తక్కువగా ఉండటంతో చాలావరకు ప్రాజెక్టులు పెండింగ్​లో పడిపోయాయి. ఆ భారం ఇప్పుడు కంపెనీల మీద పడుతోంది. ఇన్​టైమ్​లో టార్గెట్​ రీచ్​ అయ్యేందుకు ఆయా కంపెనీలు చిన్న కంపెనీలతో టైఅప్ అయ్యి ఫ్రెషర్స్, ట్రైనీలను వర్క్​లోకి తీసుకుంటున్నాయి. దాంతో సొంతూర్లకు వెళ్లిపోయిన వారూ సిటీకి తిరిగొస్తున్నారు.

సపోర్టివ్ టీమ్​గా..

సిటీలో ఐటీ సెక్టార్​లో వర్క్ చేయాలనుకునే ఫ్రెషర్స్​కి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్​మెంట్ చూపించే చిన్న కంపెనీలు వందల్లో ఉన్నాయి. ఒక్కో కంపెనీలో బ్యాచ్​ల వారీగా 50 నుంచి వందమందికిపైగా డిఫరెంట్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆయా కంపెనీలే తాము టైఅప్ అయిన కంపెనీలో రిక్వైర్మెంట్​ని బట్టి ఫ్రెషర్స్​ని పంపిస్తుంటాయి. అలా ట్రైనింగ్ పూర్తయి జాబ్​లో జాయిన్ అయ్యే టైమ్​కి లాక్ డౌన్ కారణంగా ఫ్రెషర్స్​ సొంతూళ్లకి వెళ్లిపోయారు. ప్రస్తుతం అన్ లాక్ 4 మొదలవడంతో ప్రాజెక్ట్ కంప్లీట్​ చేయాలనే ప్రెజర్స్ కంపెనీలకు పెరుగుతున్నాయి. దాంతో ప్రాజెక్ట్స్ టార్గెట్​ రీచ్​ అయ్యేందుకు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాయి. మెయిన్ టీం చేసే వర్క్​లో వాళ్లు సపోర్ట్ టీమ్​ఉండనున్నారు.

నో వర్క్ ఫ్రమ్ హోమ్..

కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతున్న ఫ్రెషర్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు. ఆఫీస్​కి వచ్చి డ్యూటీ చేయాలని కంపెనీలు చెప్తున్నాయి. ఎంప్లాయిస్ అంతా ల్యాప్ ట్యాప్ మెయింటెన్ చేయాలని సూచిస్తున్నాయి. సీనియర్ టీమ్​ చేసి పంపిన ప్రాజెక్ట్ లో కరెక్షన్స్, డేటా లో మిస్టెక్స్ ఉంటే సపోర్ట్ గా ఉన్న టీం మెంబర్స్ వాటిని ఆఫీస్ లో ఉండి క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా తక్కువ టైమ్​లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలని పెద్ద కంపెనీలు ప్లాన్ చేసుకుంటున్నాయి. పేమెంట్ తక్కువగా ఉన్నా ఎక్స్ పీరియన్స్ వస్తుందని జాయిన్ అవుతున్నట్లు  ఫ్రెషర్స్ చెప్తున్నారు.

మరొక కంపెనీతో టైఅప్..

మా కంపెనీలో బీటెక్ పాస్ అవుట్ అయిన వారికి ఎస్ఏపీ సాఫ్ట్​వేర్​లో అబాప్, ఎంఎం, పీపీ, ఎస్డీ, ఫికో వంటి కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తుంటాం. సిటీ, బెంగళూరు, ముంబై లో జాబ్స్ ఇప్పిస్తుంటాం. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న మరో బ్యాచ్​కి ఇంటర్వ్యూస్ ఉన్న టైంలోనే లాక్ డౌన్ మొదలైంది. ఇటీవల మేం టైఅప్ అయిన కంపెనీలకి ఎంప్లాయిస్ రిక్వైర్మెంట్ ఉండడంతో ఆన్​లైన్​లో ఇంటర్వ్యూస్​ కండక్ట్​ చేసి సెలెక్ట్​ అయిన వాళ్లకు డ్యూటీకి రావాల్సిందిగా మెయిల్​ పంపాం. వాళ్లు మా ఆఫీసులోనే ఉంటూ మరొక కంపెనీకి వర్క్ చేస్తారు. ఆ కంపెనీ శాలరీ ఇస్తుంది.

‑ అభి, మేనేజర్, సాఫ్ట్ వేర్ ట్రైనింగ్,కంపెనీ, జూబ్లీహిల్స్