ఐటీ ఉద్యోగుల ఆందోళనకు .. బీజేపీనేత గజ్జల యోగానంద్ మద్దతు

ఐటీ ఉద్యోగుల ఆందోళనకు .. బీజేపీనేత గజ్జల యోగానంద్ మద్దతు

 

చందానగర్, వెలుగు: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు.  ఈ నిరసనకు బీజేపీ శేరిలింగంపల్లి ఇన్​చార్జి గజ్జల యోగానంద్ మద్దతు తెలిపారు.శనివారం  బ్లాక్ టీ షర్ట్​లతో  చంద్రబాబు మద్దతుదారులు, ఐటీ ఉద్యోగులు మియాపూర్ స్టేషన్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎల్​బీనగర్​కు మెట్రోలో వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని పోలీసులు, మెట్రో అధికారులతో ఐటీ ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. ఆందోళన కారులను అడ్డుకునేందుకు సాంకేతిక కారణాల పేరు చెప్పి మెట్రో అధికారులు కొద్దిసేపు మియాపూర్ మెట్రో స్టేషన్ క్లోజ్ చేశారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఐటీ ఉద్యోగులు చేపట్టిన నిరసనకు బీజేపీ శేరిలింగంపల్లి ఇన్​చార్జి గజ్జల యోగానంద్ సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమన్నారు. హైదరాబాద్ సిటీ డెవలప్​మెంట్​​లో చంద్రబాబు పాత్ర ఉందని యోగానంద్ తెలిపారు.