చందానగర్, వెలుగు: చందానగర్‌లో అక్రమంగా తాబేళ్లను విక్రయిస్తున్న ఓ సాప్ట్వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌతమ్ నగర్ కు చెందిన సయ్యద్ అవైజ్(25) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే.. అక్రమ సంపాదన కోసం ‘రెడ్ ఇయర్’ రకానికి చెందిన తాబేళ్ల వ్యాపారాన్ని ఎంచుకున్నాడు.
పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించి, నిందితుడి నుంచి నాలుగు తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం చందానగర్ పోలీసులకు అప్పగించారు.
