నేడు ఐటీ, జీఎస్టీ ఆఫీసులు పనిచేస్తాయ్

నేడు ఐటీ, జీఎస్టీ ఆఫీసులు పనిచేస్తాయ్

ఢిల్లీ : ఇన్ కమ్ ట్యాక్స్, జీఎస్టీ, ఆఫీసులు రెండూ నేడు ఉంటాయని సీబీఐసీ తెలిపింది. ఆదివారంతో  2018 –19 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో రెవెన్యూ కలెక్షన్ టార్గెట్‌ ను చేరుకునేందుకు పన్ను ఆఫీసులను తెరిచే ఉంచుతామని సీబీఐసీ తెలిపింది. ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌‌‌‌డైరెక్ట్ ట్యాక్సస్ అండ్ కస్టమ్స్’(సీబీఐసీ) కు చెందిన అన్ని ఫీల్డ్ ఆఫీసులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజులు తెరిచే ఉంటాయి. పన్ను చెల్లింపుదారుల కోసం 2019 మార్చి 30, 31 తేదీల్లో పన్ను ఆఫీసులను అందుబాటులో ఉంచుతున్నాం ’ అని సీబీఐసీ ప్రకటించింది. అవసరమైతే మార్చి 30, 31 తేదీల్లో అదనపు కౌంటర్లు తెరిచి మరీ పన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్నులను దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యా క్సస్ (సీబీడీటీ) ఫీల్డ్ ఆఫీసులను ఆదేశించింది.

2018–19 ఆర్థిక సంవత్సరానికి చెందిన పన్ను రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేసేందుకు, సమీక్షించుకునేందుకు నేడే ఆఖరి తేది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా నేటితో ముగుస్తోంది. ఈ క్రమంలో శనివారం, ఆదివారం సెలవులను రద్దు చేసినట్టు సీబీడీటీ తెలిపింది. ఈ రెండు రోజులు సాధారణ పనివేళలు మాదిరిగానే ఇన్‌‌‌‌కమ్ ట్యా క్స్ ఆఫీసులను తెరిచి ఉంచుతున్నామని తెలిపింది. నేటితో ముగుస్తోన్న ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ల టార్గెట్‌ ను ప్రభుత్వం రూ.11.47 లక్షల కోట్లుగా నిర్ధారించుకుంది. అదేవిధంగా ప్రత్యక్ష పన్ను టార్గెట్‌ ను కూడా రూ.12 లక్షల కోట్లు గా పెట్టుకుంది. ఫిబ్రవరి వరకు రూ.10.70 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యాయి. ప్రత్యక్ష పన్నుల విషయానికొస్తే, మార్చి 23 నాటికి కేవలం రూ.10.21 లక్షల కోట్లనే ప్రభుత్వం వసూలు చేసింది. ఈ కలెక్షన్ టార్గెట్లను చేరుకోవడానికి ఫీల్డ్ ఆఫీసులు సాధ్యమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఇన్‌‌‌‌కమ్ అండ్ కార్పొరేట్ ట్యాక్సస్ అపెక్స్ పాలసీ బాడీ ఆదేశించింది. ప్రభుత్వ లావాదేవీలతో లింక్ అయి ఉన్న బ్యాంక్‌‌‌‌లు కూడా నేడు తెరిచి ఉంచాలని RBI ఆదేశించింది.