పేదలు బతకడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేదా?

పేదలు బతకడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేదా?

ఆదిలాబాద్: రెండు దశాబ్దాలకుపైగా పోడు వ్యవసాయం చేసుకుని బతుకుతున్న ఆదివాసీలపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం దారుణమని ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదలు బతకడానికి, ప్రశ్నించడానికి అవకాశమే లేదా ? అని ఆమె ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా  జైల్లో దండేపల్లి పొడుభూముల బాధిత మహిళలను మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ దాదాపు 2002 సంవత్సరం నుండి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలపై కేసులు పెట్టిన ఫారెస్ట్ అధికారులు.. మహిళలను బూతులు తిడుతూ కాళ్లతో తన్నడం అమానుషం అన్నారు. ఇలాంటి రేంజర్ ఆఫీసర్లకు ప్రజలు బడితే పూజ చేశాలన్నారు. ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. జైల్లో మహిళలకు బెయిల్ రాకుండా కేసుల మీద కేసులు పెడుతున్నారని, ఆదివాసీలు, గిరిజనులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎం కేసీఆర్ కి ఎందుకు అంత కక్ష అని ఆమె ప్రశ్నించారు.

రాజధానిలో బరితెగించి రేప్ లు చేసినా పట్టించుకొని పోలీసులు... అమాయకులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు జీవించే హక్కు లేకుండా చేస్తున్న ప్రభ్యత్వాన్ని గద్దెదించాలని ఆమె కోరారు. 5 నుండి 10 ఎకరాల వరకు పోడు భూమిని దున్నుకొనే హక్కు కాంగ్రెస్ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం పెద్దపెద్ద చెట్లు నరికి వెంచర్లు చేస్తే తప్పులేదా ? పోడు భూములు నీ తాత జాగీరా రేంజర్ అంటూ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహంతో ఊగిపోయారు. 

 

ఇవి కూడా చదవండి

కేసీఆర్ కు ప్రజలపై చిత్తశుద్ధిలేదు

ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల

బైకర్ను ఢీకొట్టిన కారు యజమాని