బీమా సంస్థలకు మూలధనం రావడం కష్టమే!

బీమా సంస్థలకు మూలధనం రావడం కష్టమే!

న్యూఢిల్లీ : నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి మూలధన నిధులు పొందే అవకాశం లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  వీటిలో ఒకటి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చే అవకాశం ఉందని, కంపెనీలు సాల్వెన్సీ మార్జిన్‌‌‌‌లను అందుకోగలుగుతాయని ఆయన అన్నారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ  యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూడు బీమా కంపెనీలకు ప్రభుత్వం గత సంవత్సరం రూ. ఐదు వేల కోట్ల మూలధనాన్ని అందించింది. 

2023 -24 బడ్జెట్‌‌‌‌లో బీమా కంపెనీలకు మూలధనం అందించలేదు. ఈ బీమా కంపెనీలలో ఒకటి ఈ సంవత్సరం డివిడెండ్ ఇవ్వవచ్చని అధికారి తెలిపారు. న్యూ ఇండియా అస్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇందులో న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే మిగతా వాటి కంటే మెరుగ్గా ఉంది.