మీర్ చౌక్ అగ్ని ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదు: మంత్రి పొన్నం

మీర్ చౌక్ అగ్ని  ప్రమాదాన్ని రాజకీయం చేయడం తగదు: మంత్రి పొన్నం

హైదరాబాద్ పాత బస్తీ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంపై రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ప్రమాదం జరుగుతుందని ముందుగా ఊహించలేమని, రాజకీయాలు తగవని హితవు పలికారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన జరిగిన వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టిందని, ఎలాంటి జాప్యం జరగలేదని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సీఎం ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్‌ డీసీపీ స్నేహా మిశ్రాలతో ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం ఆదివారం (మే 18) ఉదయం 6 గంటల కు సంభవించిందని చెప్పారు. 6.16 గంటలకు అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. మంటల్లో చిక్కుకున్న అందరినీ కాపాడే ప్రయత్నం చేశారాని.. కానీ మంటలు భారీగా వ్యాపించడంతో కొందరిని కాపాడలేకపోయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బిల్డింగ్ లో ఉన్న వాళ్లు చాలా వరకు చనిపోయినట్లు త తెలిపారు. 

ప్రమాద బాధిత కుటుంబాలతో సీఎం రేవంత్ మాట్లాడారని మంత్రి పొన్నం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి రివ్యూ చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోన్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు ప్రజలు అధికారులకు సహకరించాలని సూచించారు. 

హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఘటనా స్థలంలో ముగ్గురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో  మృతుల సంఖ్య 17 కు చేరుకుంది. ప్రమాద సమయంలో భవనలో 30 మంది ఉండగా.. 17 మంది చనిపోయారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.