
భారతీయ సంప్రదాయం ప్రకారం నిర్వహించే పండగల మీద తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. పోలీసులు స్వతంత్రతంగా వ్యవహరించట్లేదన్నారు. ఎంఐఎంతో చేతులు కలిపి టిఆర్ఎస్ హిందు వాదుల మీద కేసులు బనాయిస్తున్నారన్నారు. హిందు పండగల సమయంలో ఏర్పాటు చేసే మండపాలు, నిర్వహించే ర్యాలీల మీద ఆంక్షలు విధించటం హిందు దర్మం మీద దాడి చేయటమేనన్నారు. హిందు వాదులు, బిజేపి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి లేఖ రాసానని అర్వింద్ అన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకుల పోలిసులు, రెవిన్యూ అధికారుల మీద ఒత్తిడి పెంచారన్నారు ఎంపీ. నిన్న నిజామాబాద్ లో ఎమ్ఆర్ఓ ఆత్మహత్యను..ప్రభుత్వ హత్యగా భావించాల్సి వస్తుందన్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికపై మాట్లాడిన అర్వింద్.. సీపీఐతో టిఆర్ఎస్ ది అవకాశ వాద పొత్తు అని అన్నారు. ఎవరూ ఎవరితో చేతులు కలిపినా, బీజేపికి నష్టం లేదని చెప్పారు.