ఉమెన్స్ డే కాదు.. ఫూల్స్ డే

ఉమెన్స్ డే కాదు.. ఫూల్స్ డే

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా తనదైన శైలిలో స్పందించింది స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ‘అయ్యో మర్చిపోయా.. ! ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవం కదా. ఈ రోజు రాగానే ప్రతి ట్రోలర్, మీమర్ కు హఠాత్తుగా మహిళలపై ఎనలేని గౌరవం పొంగుకొస్తుంది. మహిళలను గౌరవిస్తున్నట్లు పోస్టులు పెడుతూ తెగ ఫోజులు కొడతారు. కానీ 24 గంటలు దాటితే అంతా మామూలే. కాబట్టి అలాంటివి నమ్మకండి. మీ అందరికి హ్యాపీ ఫూల్స్ డే ’ అంటూ అనసూయ ట్విట్టర్ లో పోస్టు  చేసింది. 

కాగా.. అందరు మగాళ్లు ఒకేలా ఉండరని.. మీరలా అనుకోవడం మీ అమాయకత్వమని, గుడ్డిగా అలా అనుకోవడం మీ తప్పు అంటూ  అనసూయపై అటాక్ కు దిగారు కొందరు మగ నెటిజన్లు. 

హాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన ఆలియా