రండి బాబూ రండి! వలస కూలీలకు బంపర్​ ఆఫర్లు

రండి బాబూ రండి! వలస కూలీలకు బంపర్​ ఆఫర్లు

లాక్​డౌన్ టైమ్​లో, రిలాక్సేషన్స్​ తర్వాత వలస కూలీలంతా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు కన్‌‌స్ట్రక్షన్‌‌, రియల్టీ సెక్టార్‌‌పూర్తిగా ఓపెనయ్యాయి. కానీ కూలీల్లేరు. వాళ్లు లేనిదే ఈ రంగం ఇంచుకూడా  కదలదు. దీంతో కూలీలను రప్పించేందుకు వివిధ సంస్థలు, ప్రభుత్వం నానా తిప్పలు పడుతున్నాయి.  అడ్వాన్సులు ఇస్తామని, బాగా చూసుకుంటామని, ప్రయాణ ఖర్చులు భరిస్తామని నచ్చచెబుతున్నారు. 

న్యూఢిల్లీకూలీల కొరత కన్‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌, రియల్టీ సెక్టార్లకు ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. వీరిని రప్పించడానికి కంపెనీలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. స్థానికంగా లేబర్ దొరక్కపోవడంతో వలస కూలీలపై ఆధారపడకతప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే వీరిని ఎలాగైనా తిరిగి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నాయి. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌రూల్స్‌‌‌‌ను క్రమంగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల కన్‌‌‌‌స్ట్రక్షన్లను మొదలుపెట్టడానికి పర్మిషన్లు ఇచ్చింది. ఈ రంగంలో పనిచేసేవారిలో ఎక్కువ మంది వలస కూలీలనే విషయం తెలిసిందే. కరోనా మొదలుకాగానే వీరిలో మెజారిటీ కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. చాలా మంది ఇప్పట్లో తిరిగి నగరాలకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీంతో రియల్టీ/కన్‌‌‌‌స్ట్రక్షన్ల సెక్టార్ల డెవలపర్లు వీరిని తిరిగి వెనక్కి తీసుకురావడానికి తిప్పలు పడుతున్నారు. అడ్వాన్సులు ఇస్తామని, బాగా చూసుకుంటామని, ప్రయాణ ఖర్చులు భరిస్తామని వారికి నచ్చచెబుతున్నారు. అనుకున్న తేదీలోపు ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే అదనంగా డబ్బు ఇస్తామని కూడా ఆశచూపుతున్నారు. బెంగళూరుకు చెందిన ఒక కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌కంపెనీకి చెందిన ఒక కాంట్రాక్టర్‌‌‌‌పది మంది కార్పెంటర్లను బిహార్‌‌‌‌నుంచి హైదరాబాద్‌‌‌‌కు విమానంలో రప్పించారు. ఇందుకు అయిన ఖర్చులన్నింటినీ ఆయనే భరించారంటే లేబర్ కొరత ఎంతగా ఉందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇతర కంపెనీలకు వెళ్లవద్దని, వాళ్ల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని కూడా డెవలపర్లు ఆశచూపుతున్నారు.

లక్షల్లో వలస కూలీలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌సెక్టార్లో 8.5 లక్షల మంది వలస కూలీలు పనిచేస్తున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది బిహార్‌‌‌‌, ఝార్ఖండ్‌‌‌‌, ఉత్తరప్రదేశ్‌‌‌‌, ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, ఒడిశా రాష్ట్రాల వాళ్లు. హైదరాబాద్‌‌‌‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పనులు చేస్తారు. తెలంగాణ ఇండస్ట్రియల్‌‌‌‌సెక్టార్‌‌‌‌అభివృద్ధికి వీళ్లు ముఖ్యమని గుర్తించిన ప్రభుత్వం.. ప్రతి ఒక్క వలస కూలీకి 500 రూపాయలు, 12 కిలోల బియ్యం అందించింది. ఉచితంగా భోజన, వసతి సదుపాయాలు కల్పించింది. అయినప్పటికీ కరోనా భయంతో చాలా మంది వలస కూలీలు నడుచుకుంటూ సొంత రాష్ట్రాలకు బయల్దేరారు. ఆకలిదప్పులు, అనారోగ్యం వల్ల వందలాది మంది మధ్యలోనే మరణించారు.  గత నెల నుంచి ఇప్పటి వరకు 1.50 లక్షల మంది వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

హైదరాబాద్‌‌‌‌కు  మళ్లీ వచ్చిన కూలీలు

కరోనా గురించి తెలిశాక చాలా మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లినా, కొందరు నగరాల్లో ఉండేలా పెద్ద కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌కంపెనీలు ఒప్పించాయి.  ఆహారం, బస, వైద్య సదుపాయాలు కల్పించాయి.  సొంత రాష్ట్రాలకు వెళ్లిన వారిని తిరిగి తీసుకురావడానికి ఇప్పుడు ఇవి ప్రయత్నిస్తున్నాయని కాన్ఫిడరేషన్‌‌‌‌ఆఫ్‌‌‌‌రియల్‌‌‌‌ఎస్టేట్‌‌‌‌డెవెలపర్స్‌‌‌‌అసోసియేషన్‌‌‌‌ఆఫ్‌‌‌‌ఇండియా(క్రెడాయి) తెలంగాణ యూనిట్‌‌‌‌సభ్యుడు ఒకరు వివరించారు. గత నెల నుంచి ఇప్పటి వరకు 300 మంది బిహార్‌‌‌‌వలస కూలీలు తెలంగాణకు తిరిగి వచ్చారు. ఇప్పుడు వీరంతా రైస్‌‌‌‌మిల్స్‌‌‌‌లో పనిచేస్తున్నారు. వీళ్లంతా అక్కడి నుంచి తెలంగాణకు రాగానే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు పూలుజల్లి వెల్‌‌‌‌కమ్‌‌‌‌చెప్పారు. తెలంగాణ రైస్‌‌‌‌మిల్స్‌‌‌‌లో పనిచేస్తున్న వారిలో 90 శాతం మంది బిహార్‌‌‌‌వలస కూలీలే!

కొత్త ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ వచ్చాయ్