IT News: టెక్కీలకు శుభవార్త చెప్పిన Cognizant.. నవంబర్ 1 నుంచి శాలరీ హైక్స్..!

IT News: టెక్కీలకు శుభవార్త చెప్పిన Cognizant.. నవంబర్ 1 నుంచి శాలరీ హైక్స్..!

Cognizant Salary Hikes: గడచిన రెండు త్రైమాసికాలుగా భారత ఐటీ రంగం ప్రపంచ మందగమనం, అనిశ్చిత వాతావరణంతో పాటు ఏఐ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో దేశీయ టాప్ టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వేతన పెంపులను ఆలస్యం చేస్తూ వచ్చాయి. కానీ ప్రస్తుతం పెద్ద ఐటీ సేవల సంస్థలు మెల్లగా వేతన పెంపులను ప్రకటిస్తూ వస్తున్నాయి. దాదాపు వారం రోజుల కింద దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ శాలరీ హైక్స్ గురించి కీలక ప్రకటన చేసింది. దీంతో దీపావళికి ముందు టెక్కీలకు పెరిగిన వేతనాలు తమ ఖాతాల్లో క్రెడిట్ అవుతాయి.

ప్రస్తుతం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తమ భారతీయ ఉద్యోగులకు వేతన పెంపుల గురించి శుభవార్త చెప్పింది. తమ ఉద్యోగుల్లో 80 శాతం మంది అర్హులకు పెంచిన వేతనాలు నవంబర్ 1, 2025 నుంచి అందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది. మంచి పనితీరు కలిగిన ఉద్యోగులకు రెండవ త్రైమాసికంలో వేతన పెంపులు అందిస్తామని గతంలోనే కంపెనీ చెప్పగా ప్రస్తుతం దానిని ఆచరణ రూపంలో పెట్టింది. 

ALSO READ : లిస్ట్ అవ్వగానే 100% లాభం ఇచ్చిన ఐపీవో..

టాప్ పెర్ఫార్మర్లకు ఉత్తమ సింగిల్ డిజిట్ హైక్ ఉంటుందని కాగ్నిజెంట్ ప్రతినిధి వెల్లడించారు. సాధారణంగా కాగ్నిజెంట్ ప్రతిసారి ఆగస్టు 1 నాటికి వేతన పెంపులను గతంలో అందిస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ ట్రేడ్ టారిఫ్స్, మైక్రో ఎకనమిక్ ప్రతికూలతల కారణంగా క్లయింట్స్ తమ టెక్ బడ్జెట్ ఖర్చులను ఆచితూచి స్పెండింగ్ చేయటం వల్ల ఆలస్యం అయినట్లు కంపెనీ చెబుతోంది. మెుత్తానికి టీసీఎస్, కాగ్నిజెంట్ మినహా ఇతర టెక్ కంపెనీలు ఇప్పటి వరకు శాలరీ హైక్స్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. 

కాగ్నిజెంట్ జూన్ త్రైమాసికంలో కొత్తగా 7వేల 500 మంది ఉద్యోగులను పెంచుకోవటంతో దాని మెుత్తం ఉద్యోగుల సంఖ్య 3లక్షల 43వేల 800కి చేరింది. 2025లో కంపెనీ 15వేల నుంచి 20వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని నిర్థేశించుకుందని సీఈవో రవి కుమార్ గతంలోనే చెప్పారు.