అజీమ్ ప్రేమ్జీ జీవితం అందరికీ ఆదర్శం

అజీమ్ ప్రేమ్జీ జీవితం అందరికీ ఆదర్శం

TS ఐపాస్ ద్వారా 15రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇస్తున్నామన్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. కొత్త పరిశ్రమలకు మౌలిక సౌకర్యాలతో పాటు రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఈ - సిటీలో 300 కోట్లతో విప్రో కన్జ్యూమర్ కేర్ ఫ్యాక్టరీని.. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అజీమ్ ప్రేమ్ జీని మంత్రులు సన్మానించారు. అజీమ్ ప్రేమ్ జీ జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు మంత్రి కేటీఆర్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయనతత్వం అందరికీ ఆదర్శమన్న ఆయన.. దేశం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే సమయంలో విప్రో నుంచి ఎంతో సహకారం అందించారని తెలిపారు. విప్రో మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేయాలని అందుకు తగిన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలో విప్రో కన్జ్యూమర్ కేర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అజీమ్ ప్రేమ్ జీ అన్నారు . ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, విప్రో ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం

 

వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట

మా పిల్లలను డ్రగ్స్ టెస్ట్ కు తీసుకొస్తా..