ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు విదేశాల్లో మంత్రి కేటీఆర్

ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు విదేశాల్లో మంత్రి కేటీఆర్

వాళ్టి నుంచి 10 రోజుల పాటు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విదేశాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. బ్రిటన్ తో పాటు స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కు బయలుదేరి వెళ్లారు. లండన్ లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీకానున్నారు మంత్రి కేటీఆర్.

ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ నెల 26వ తేదీన తిరిగి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు కేటీఆర్. మంత్రి పర్యటన నేపథ్యంలో యూకేలోని వెస్ట్‌ లండన్‌లోని పలు ప్రాంతాల్లో కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.

మరిన్ని వార్తల కోసం..

వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా..?

సన్ రైజర్స్ కు డు ఆర్ డై మ్యాచ్