ఇటీవల్ స్విట్జర్లాండ్ లోని దావో స్ లోజరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ సదస్సులో తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. గురువారం (మార్చి26) దావోస్ లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల వివరాలను అసెంబ్లీకి సమర్పించారు.
దావోస్ పర్యటనలో మొత్తం రూ. 2.19 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని శ్రీధర్ బాబు చెప్పారు. 44 కంపెనీలతో రాష్ట్రప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్నదని అన్నారు. ఈ పెట్టుబడులతో 68వేల 150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల వస్తాయన్నారు.
2024 దావోస్ పర్యటనలో 18 ఎంవోలతో రూ. 40వేల 232 కోట్ల పెట్టుబడులు, 2025లో 26 ఎంవోయూలతో రూ. 1లక్షా 78వేల 950 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 6కంపెనీలకు భూకేటాయింపుల ద్వారా ప్రభుత్వానికి రూ. 15వందల 40 కోట్ల ఆధాయం, మరో మూడు కంపెనీలకు 30వేల కోట్ల పెట్టుబులకోసం భూమిని గుర్తించామన్నారు. నిజమాబాద్ లో 681 సీట్ల సామర్థ్యంతో ఐటీటవర్ లో 11 కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. వాటిలో 276 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీకి తెలిపారు.
