గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో ఐటీ సోదాలు

గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో ఐటీ సోదాలు

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 40 కార్లు,3 సీఆర్పీఎఫ్ వాహనాల్లో ఐటీ బృందాలు వెళ్లాయి. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైలోనూ సోదాలు చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడీఐ బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో గల ఎక్సెల్ రబ్బర్ పరిశ్రమలో ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.  సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం పాశం మైలారం పారిశ్రామిక వాడలోని రెండు చోట్ల కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ యూనిట్ -5తో పాటు విలాస్ పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోనూ అధికారులు సెర్చింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ టీమ్ కంపెనీ రికార్డులను పరిశీలిస్తోంది. కాగా లోనికి ఎవరినీ అనుమతించడం లేదని సమాచారం.

ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో 5 గంటలుగా 40 చోట్ల ఐటీ సోదాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎక్సెల్ గ్రూప్ కి అనుబంధంగా ఉన్న మరో 4 కంపెనీల్లో సోదాలు చేస్తున్న ఐటి అధికారులు.. గచ్చిబౌలి లోని కార్పొరేట్ ఆఫీస్ తో పాటు, మాదాపూర్ బాచుపల్లిలోని కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. రబ్బర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ లో భారీగా తేడాలతో పాటు, ట్యాక్స్ చెల్లింపులో అవకతవకల్లో భాగంగా అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం.