నగల వ్యాపారులపై ఐటీ శాఖ దాడులు.. రూ.116 కోట్ల నగదు, ఆస్తులు స్వాధీనం

నగల వ్యాపారులపై ఐటీ శాఖ దాడులు.. రూ.116 కోట్ల నగదు, ఆస్తులు స్వాధీనం

మహారాష్ట్ర: నాసిక్‌లోని సురానా జ్యువెలర్స్‌పై ఆదాయపు పన్ను శాఖ ఆదివారం(మే 26) దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో లెక్కచూపని దాదాపు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. 

సురానా జ్యువెలర్స్‌ యజమాని సహా వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. లెక్కించేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గంటల పాటు శ్రమించారు. యాజమాన్యం లావాదేవీల్లో అవకతవలకు పాల్పడడంతో ఆదాయపు పన్ను శాఖ ఈ దాడులు చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ దాడులతో మహారాష్ట్రలో కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ చాలా అలర్ట్‌గా ఉంది. ఇటీవల నాందేడ్‌లో ఆ శాఖ చేపట్టిన దాడుల్లో రూ.170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.