వీ కేర్ కోల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీపై కొనసాగుతున్న ఐటీ దాడులు

వీ కేర్ కోల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీపై కొనసాగుతున్న ఐటీ దాడులు

అలంపూర్, వెలుగు: గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రం సమీపంలోని వీ కేర్‌‌‌‌‌‌‌‌ సీడ్స్‌‌‌‌‌‌‌‌, కోల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీ, ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్లలో బుధవారం కూడా ఐటీ ఆఫీసర్ల తనిఖీలు కొనసాగాయి. ఈ తనిఖీలో మరో రోజు కూడా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీల ద్వారా భారీ మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు ప్రచారం కావడంతో స్పందించిన ఐటీ ఆఫీసర్లు పలు కోల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీలపై దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వీ కేర్‌‌‌‌‌‌‌‌ కోల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్, గోడౌన్‌‌‌‌‌‌‌‌లో నిల్వఉన్న ధాన్యం స్టాక్ రిజిస్టర్లు, పంటల వివరాలను పరిశీలించి పలు వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.