హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పంజాగుట్ట, అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్ యూసఫ్ గూడ ఏరియాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. పొద్దంతా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడిన జనం.. చిరు జల్లులతో రిలాక్స్ అయ్యారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోనే వర్షాలు పడుతున్నాయన్నారు అధికారులు. ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు తుఫానుగా మారే అవకాశముందని తెలిపారు. ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ – ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశముందని అధికారులు చెప్పారు.

కొత్త టీమ్ తో కాంగ్రెస్ కు బలం పెరిగింది

విగ్రహ ఏర్పాటులో వివాదం.. బోధన్ లో హై టెన్షన్