విడుదలకు సిద్ధమైన సప్త సాగరాలు దాటి

విడుదలకు సిద్ధమైన సప్త సాగరాలు దాటి

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో  విడుదల చేసింది. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కు తోంది.

సైడ్ ఏగా విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. హేమంత్ ఎం.రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్ రుక్మిణీ వసంత్ కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా సైడ్ బి (సెకెండ్ పార్ట్‌‌) రిలీజ్ డేట్‌‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. నవంబర్ 17న ఈ  చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.