మల్లారెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన

మల్లారెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన

మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డి నివాసాల్లో జరుగుతున్న ఐటీ సోదాలకు నిరసన తెలుపుతూ..ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోడీకి వ్యతిరేకంగా ఖబడ్దార్ బీజేపీ అంటూ నినాదాలు చేశారు. దీంతో కార్యకర్తలు లోపలికి వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. తమను లోపలికి వెళ్లనివ్వండి అంటూ పోలీసులతో.. టీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి ప్రయత్నించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

సంతోష్ రెడ్డి ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం

మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు  కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు అధికారులు సంతోష్ రెడ్డి ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. సంతోష్ రెడ్డి ఇంట్లో దొరికిన కీలక పత్రాలు తీసుకుని.. దూలపల్లిలోని అశోక అల మైసన్ 135 విల్లాలో నివాసం ఉంటున్న ప్రవీణ్ రెడ్డి ఇంటికి అధికారులు వెళ్లారు. ప్రవీణ్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.