బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్కు షమీ, జడేజా దూరం

బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్కు షమీ, జడేజా దూరం

గాయం కారణంగా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు దూరమైన బౌలర్ మహ్మద్ షమీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు..టెస్టు సిరీస్కు దూరమయ్యే అవకాశాలున్నాయి. వీరిద్దరు గాయాల నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో...బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో  జడేజా స్థానాన్ని యూపీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ భర్తీ చేసే యోచనలో బీసీసీఐ ఉంది. అటు షమీ స్థానంలో పేసర్ నవదీప్ సైనిని ఎంపిక చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు బంగ్లాదేశ్ ఏ తో జరుగుతున్న అనధికార టెస్టు సిరీస్లో పాల్గొంటున్నారు. 

కుర్రాళ్లకు ఛాన్స్..

యూపీ స్పిన్నర్ సౌరభ్ కుమార్..రంజీ ట్రోఫీలో నిలకడగా రాణించాడు. టెయిలెండర్గా వచ్చి..జట్టుకు విలువైన పరుగులు చేశాడు. ఇటీవలే 55 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అటు షమీ స్థానంలో నవదీప్ సైనిని ఎంపిక చేస్తే ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్తో కలిసి ఆడనున్నాడు.  మరోవైపు రెండో వన్డేలో బొటనవేలికి గాయం కావడంతో..స్వదేశానికి చేరుకున్న రోహిత్ శర్మ కూడా బంగ్లాతో జరిగే టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని యువ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్తో  భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు తెలుస్తోంది.  ఇండియా-ఎ కెప్టెన్‌గా వ్యవహరించిన అభిమన్యు ఈశ్వరన్‌  టెస్టు సిరీస్కు ఎంపికైతే ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి.

టెస్టు సిరీస్..

రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భాగంగా  ఫస్ట్ టెస్టు డిసెంబర్ 14న మొదలు కానుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు చిట్టగాంగ్లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో తొలి టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత రెండో టెస్టు డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఢాకాలో జరగనుంది.