
ముంబై: సువెన్ ఫార్మా అమ్మకానికి రంగం రెడీ అయినట్లు తెలుస్తోంది. సువెన్ఫార్మాను అమ్మేందుకు ప్రమోటర్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను సైతం అపాయింట్ చేసినట్లు సమాచారం. ఈ కంపెనీలో మెజారిటీ వాటా విక్రయించాలనేది ప్రమోటర్ల ఆలోచనగా సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు, స్ట్రాటజిక్ ప్లేయర్లతో కంపెనీ డిస్కషన్స్ జరుపుతోందని పేర్కొన్నాయి. సువెన్ఫార్మాలో ప్రమోటర్లకు 60 శాతం వాటా ఉంది.
గ్రూప్‌లోని మరో కంపెనీ సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కొత్త డ్రగ్స్ డెవలప్మెంట్ కోసం అవసరమైన ఫండ్స్ కోసమే సువెన్ ఫార్మాలో మెజారిటీ వాటా అమ్మకానికి పెట్టారని చెబుతున్నారు. సువెన్ ఫార్మా నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని సువెన్ లైఫ్ సైన్సెస్ కొత్త డ్రగ్స్ డెవలప్మెంట్ కోసం ఇప్పటిదాకా ప్రమోటర్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఈ రెండు కంపెనీల డీమెర్జర్ తర్వాత 2020లోనూ సువెన్ ఫార్మాను అమ్మాలని ప్రమోటర్లు ప్రయత్నించినట్లు పేర్కొంటున్నారు.