ప్రధాని పదవికి మారియో డ్రాఘి రాజీనామా

ప్రధాని పదవికి మారియో డ్రాఘి రాజీనామా

రోమ్​: ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీలు తమ సపోర్టును ఉపసంహరించుకోవడంతో మారియో రిజైన్​ చేశారు. తన రాజీనామా లేఖను ప్రెసిడెంట్​ సెర్గియో మట్టరెల్లాకు అందజేశారు. దీంతో అధ్యక్షుడు పార్లమెంటును రద్దుచేసి ఈ ఏడాది సెప్టెంబర్​ లేదా అక్టోబర్​లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని సూచించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటిదాకా డ్రాఘి ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగవచ్చు. యూరోపియన్​ సెంట్రల్​బ్యాంక్​ మాజీ హెడ్​గా కూడా పనిచేసిన డ్రాఘి 2021 ఫిబ్రవరిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే దేశం కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విభేదాలను పక్కకు పెట్టి ప్రభుత్వం కొనసాగేందుకు సహకరించాలని కూటమిలోని పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేసినా ఆ పార్టీలు వినిపించుకోలేదు. దీంతో డ్రాఘి రాజీనామా చేయాల్సి వచ్చింది.