ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన ఐటీడీఏ పీవో

ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన ఐటీడీఏ పీవో

వరంగల్ జిల్లా:  వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో బల్లి పడ్డ ఆహారం తిని  40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో అంకిత్ పరిశీలించారు. హాస్టల్ లోని విద్యార్థులు, సిబ్బంది తో మాట్లాడి వివరాలు సేకరించారు. నిన్న జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటన పై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డెన్ ను సస్పెండ్ చేసినట్లు పీవో తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

ఈనేపథ్యంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృత శ్రీ కూడా ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. కాగా, పిల్లలను మంచిగా చూసుకుంటారని హాస్టల్ కు పంపిస్తే పురుగుల అన్నం పెడుతున్నారని వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బల్లి పడిందని చెబితే దాన్ని తీసేసి తినాలని విద్యార్థులను వార్డెన్ బెదిరించారని పేరెంట్స్ ఆరోపించారు. అదే ఫుడ్ ను వార్డెన్ తింటారా అని ప్రశ్నించారు.