స్కీమ్​ల్లో పెట్టుబడి పెట్టొద్దు : ప్రతీక్​జైన్

స్కీమ్​ల్లో పెట్టుబడి పెట్టొద్దు : ప్రతీక్​జైన్

భద్రాచలం,వెలుగు : అవగాహన లోపంతో పెట్టుబడులు పెట్టి, వివిధ స్కీంలు కట్టి నష్టపోవద్దని ఉద్యోగులకు ఐటీడీఏ పీవో ప్రతీక్​జైన్​ సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం యూనిట్​ ఆఫీసర్లు, ఉద్యోగులకు బ్యాంకర్లతో ఆయన అవగాహనా సదస్సు నిర్వహించారు. కొందరు ఉద్యోగులు స్కీమ్​లలో డబ్బులు పెట్టి, ఇతర పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకే నిపుణులైన బ్యాంకర్లతో ఈ సదస్సును పెట్టినట్లు వివరించారు.

ఉద్యోగ విరమణ తర్వాత కొందరికి పెన్షన్​ కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని సూచించారు. డబ్బును ఏ విధంగా పొదుపు చేయాలి, కాలపరిమితికి సంబంధించిన అంశాలను పవర్​ ప్రజంటేషన్​ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు.