వడ్డెర్లకు ఫెడరేషన్‌ , రూ.200 కోట్లు

వడ్డెర్లకు ఫెడరేషన్‌ , రూ.200 కోట్లు

వడ్డెర్లకు ప్రత్యేక ఫెడరేషన్‍ ఏర్పాటు చేసి రూ.200 కోట్లు ఇస్తామని, కంకర తరలించేం దుకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేస్తామని మంత్రి ఈటల రాజేం దర్‍ అన్నారు. జమ్మికుం టలో సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ వడ్డెర కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. దేశ సౌభాగ్యం , సౌలభ్యం కోసం కృషి చేసిన  వడ్డెర కులస్థులకు ఉప్పల్‌ లో రూ. కోటితో బిల్డిం గ్ నిర్మించేం దుకు నిధులు ఇచ్చామన్నారు.13 కుల సంఘాల భవనాల నిర్మా ణాలకు రూ.6 కోట్లు నిధులు కేటాయించింది కేవలం కరీం నగర్‍ జిల్లాలో నేనని స్పష్టం చేశారు. లంచాలు, పైరవీలు  లేకుం డా దరఖాస్తు ఇచ్చిన పేదవారికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తమదే అన్నారు. రాబోయే కాలంలో జాగా ఉంటే ఇల్లు కట్టిం చి ఇస్తామని, లేకుం టే రూ.3 లక్షలు ఇస్తామని చెప్పా రు. 56 ఏళ్ల కష్టాలను నాలుగేళ్లలో తీర్చలేమన్నారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తానని తెలిపారు. పదవిలో ఉన్నన్ని రోజులు అందరికి అందుబాటులో ఉండి సేవలందిం చానని, మరోసారి గెలిపించి సేవ చేసే భాగ్యం కల్పిం చాలని కోరారు.