
పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతున్న క్రమంలో చాలామంది ఎలక్ట్రిక్ బైకుల కొనుగోలు ఇష్టపడుతున్నారు.దీంతో టెక్నాలజీ యుగంతో ఎలక్ట్రానిక్ వాహనాలుకు మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్ బైకులు వదిలి ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ వాహనాలను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఐటీఐ విద్యార్థి, బైక్ మెకానిక్ కలిసి పాత పెట్రోల్ బైక్ ని ఎలక్ట్రిక్ బైక్ గా మార్చాలని అనుకున్నారు..అనుకున్నదే ఆలస్యం తన పాత బైక్ ను ఈ బైక్ గా మార్చారు. ఈ బైక్ తయారీకి ఎంత ఖర్చు అయింది.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది.. బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి ప్రాంతానికి చెందిన విద్యార్థి పంకజ్ ,అతని స్నేహితుడు మెకానిక్ తాహిర్ కలిసి పాత బైక్ ఫ్యాషన్ ప్రోను ఈ బైక్ గా మార్చారు. పంకజ్ కి బైక్ కొనడానికి మార్కెట్ కి వెళ్లినప్పుడు ఈ ఆలోచన వచ్చిందట. ఎలక్ట్రానిక్ వాహనం ధ రూ. 1లక్ష పైనే ఉంది. అప్పుడుపంకజ్ కి ఆలోచన వచ్చి తాహిర్ ని సంప్రదించాడు. తాహిర్ వృత్తి రీత్యా బైక్ మెకానిక్ రావడంతో.. బైక్ పై ఉన్న పూర్తి అవగాహనతో పాత బైక్ ను గ్రీన్ బరేలీ ఈ బైక్ గా మార్చాడు.
ఈ బైక్ లో 512 బోల్ట్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ బైక్ ను పూర్తి ఛార్జింగ్ చేసిన తర్వాత 70 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. బైక్ గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఈ- బైక్ పర్యావరణానికి ఇది హాని కలిగించదు కాబట్టి.. దీనికి గ్రీన్ బైక్ అని పేరుకూడా పెట్టారు.ఈ బైక్ తయారీకి మొత్తం 60 వేల ఖర్చు వచ్చిందట.