
- ఐటీపీఐ రీజనల్ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: సిటీని ప్రజలందరు కలిసి క్లీన్ గా మార్చుకోవాలని ఐటీపీఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా) రాష్ట్ర రీజినల్ చాప్టర్ చైర్మన్, డీటీసీపీ ( డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్) దేవేందర్ రెడ్డి అన్నారు. సుస్థిర నగర జీవనం పౌరుల భాగస్వామ్యంతోనే ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తాము భాగస్వాములం కావడం గర్వకారణమన్నారు. వరల్డ్ క్లీన్ అప్ డే సందర్భంగా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గర ఐటీపీఐ, డెకాథ్లాన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు.
వరల్డ్ క్లీన్ అప్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాలు, కాలుష్య సమస్యలను తగ్గించేందుకు వ్యక్తులు, సంస్థలు కలిసి పనిచేయాలని ప్రోత్సహించే అంతర్జాతీయ ఉద్యమమని ఆయన చెప్పారు. వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు కలిసి ఈ పరిసరాల్లో 60 కిలోల వ్యర్థ పదార్థాలను సేకరించి, ప్రజలకు శుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రజా స్థలాలపై అవగాహన కల్పించారు.