
ఈ భూమిపై మనిషి కనిపెట్టిన లోతైన ప్రాంతం ‘మరియానా ట్రెంచ్’. కేవలం కొంతమంది మాత్రమే చేరుకున్న ఈ ప్రాంతం.. అడుగడుగునా అద్భుతాల మయం. సముద్రపులోతుకి డైవ్ చేసే కొద్దీ కొత్త ప్రపంచం.. కాదుకాదు సరికొత్త ప్రపంచాలు ఎదురవుతుంటాయి. మరియానా ట్రెంచ్ పసిఫిక్ మహాసముద్రంలో ఫిలిప్పీన్స్‌కు తూర్పున ఉంది. మరియానా ఐలాండ్స్‌కు దగ్గర్లో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. 1960లో జాక్వెస్ పికార్డ్, డాన్ వాల్ష్ అనే ఇద్దరు డైవర్స్ మొదటిసారి మారియానా ట్రెంచ్‌కు వెళ్లారు. ఈ ట్రెంచ్ అడుగు భాగాన్ని ‘చాలెంజర్ డీప్’ అంటారు. మరియానా ట్రెంచ్.. 11 కి.మీ. లోతు, 69 కి.మీ వెడల్పుతో ఉంటుంది. ఇక్కడి ప్రెషర్ భూమిపై ఉండే సాధారణ ప్రెషర్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ. మరియానా ట్రెంచ్ ఎవరెస్ట్ కంటే పెద్దది. ఎవరెస్ట్ పర్వతాన్ని మరియానా ట్రెంచ్‌లో ఉంచితే పూర్తిగా మునిగిపోతుంది.
లోతుకి వెళ్లేకొద్దీ..
భూమిపై ఎత్తైన ప్రాంతమైన ఎవరెస్ట్ అంచుకు వేల మంది చేరుకున్నారు. కానీ మరియానా ట్రెంచ్‌ను మాత్రం కేవలం13 మంది మాత్రమే చేరుకోగలిగారు. డీప్ డైవ్ చేస్తూ మరియానా ట్రెంచ్‌కు చేరుకోవడం అంత ఈజీ కాదు. ఈ జర్నీ ఎలా ఉంటుందంటే..
మరియానా ట్రెంచ్‌కు డైవ్ మొదలుపెట్టాక 200 అడుగుల లోతులో ‘వరక్కా’ జాతికి చెందిన పెద్ద తిమింగలాలు, సొరచేపలు, అపెక్స్ ప్రెడేటర్స్ జీవులు కనిపిస్తాయి. అది దాటి ఇంకా లోతుకు వెళ్తే 300 అడుగుల లోతులో ‘పసిఫిక్ ఆక్టోపస్’ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇంకా లోతుకు వెళ్లే కొద్దీ సన్టైట్ తగ్గిపోతుంటుంది. అంతా చీకటిగా మారుతుంది. 500 అడుగుల లోతుకు చేరుకుంటే ‘జపనీస్ స్పైడర్ క్రాబ్’ కనిపిస్తుంది. ఇక్కడి వరకూ సాధారణ స్కూబా డైవర్స్ చేరుకోగలరు. ఇంతకంటే లోతుకు వెళ్లాలంటే స్పెషల్ ట్రైనింగ్ అవసరం.
డైవ్ కంటిన్యూ చేస్తూ.. 1500 అడుగుల వరకూ చేరుకుంటే సన్‌లైట్ పూర్తిగా జీరో అవుతుంది. వింత శబ్దాలు వినిపిస్తాయి. ధ్వని వేగం తగ్గిపోతుంది. ఈ జోన్‌లోనే అరుదైన జీవులుగా పేరొందిన బ్లూ వేల్స్‌ను చూడొచ్చు. అది దాటి 3,900 అడుగుల లోతు వరకు చేరుకుంటే ‘హై ప్రెషర్ జోన్’ వస్తుంది. ఇక్కడి ప్రెషర్‌ను తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇక్కడ అత్యంత అరుదైన వైట్ షార్క్ కనిపిస్తుంది. అలాగే ‘వెస్ట్ మాటా’ అనే సబ్‌మెరిన్ వాల్కనో కూడా కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అగ్నిపర్వతాల్లో ఒకటి. 2009లో దీని చివరి విస్ఫోటం జరిగింది. దీన్ని కూడా దాటి 4,200 అడుగుల లోతుకు చేరుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద తాబేళ్లు అయిన ‘లెదర్‌బ్యాక్ టర్టిల్స్’ కనిపిస్తాయి.
ఐదువేల అడుగులు దాటిన తర్వాత సముద్రం లోపలి ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ అత్యంత భయంకరమైన జీవులు నివసిస్తుంటాయి. 6,600 అడుగుల లోతులో ప్రమాదకరమైన ‘బ్లాక్ డ్రాగన్ ఫిష్’ కనిపిస్తుంది. ఇంకా లోతుకెళ్తే 10,000 అడుగుల దగ్గర భయంకరమైన ‘ఆంగ్లర్ చేపలు’ కనిపిస్తాయి. ఇంకా లోతుకు డైవ్ చేస్తే 22,621అడుగుల దగ్గర1941లో సౌత్ అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన ‘ఎస్‌ఎస్ రియో గ్రాండ్’ నౌక కనిపిస్తుంది. ఇక అది కూడా దాటి లోతుకెళ్తే 36,201అడుగుల దగ్గర మరియానా ట్రెంచ్‌ను చేరుకుంటాం. దీన్ని దాటి ఇంకా లోతుకెళ్తే మనకు తెలియని ఎన్నో కొత్త ప్రాణులు ఉండొచ్చు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే మరియానా ట్రెంచ్‌లో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించాయట. సముద్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఇప్పటికే చాలారకాల చేప జాతులు అంతరిస్తున్నాయి. దీనికి తోడు సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువ కావడాన్ని చూసి ఎన్విరాన్మెంటలిస్ట్లు ఆందోళన చెందుతున్నారు.
చివరి పాయింట్
మరియానా ట్రెంచ్ అనేది కేవలం మనిషి వెళ్లగలిగిన చివరి పాయింట్ మాత్రమే. కానీ సముద్రపు లోతు ఇంకా ఉంది. అక్కడకు వెళ్లే కొద్దీ చీకటిగా ఉంటుంది. సబ్‌మెరైన్లు కూడా తట్టుకోలేనంత ప్రెషర్ ఉంటుంది. మరియానా ట్రెంచ్‌ను దాటి ఇంకా లోతుకు వెళ్తే అక్కడ మరొక ప్రపంచం ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సూర్యుడి వేడి, లైట్ అవసరం లేని కొత్తరకం జీవులు అక్కడ నివసించే అవకాశం ఉందంటున్నారు.